ఖబర్దార్ పేర్ని నాని

అనంతపురం: జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి మాట్లాడుతూ వారహి యాత్ర విజయం మీరు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తో అవార్కులు చవాకులు పేలుస్తున్నారని తెలిపారు. గురువారం వారాహి యాత్రకు జన సంద్రాన్ని చూసి ఎక్కడ 2024 లో మాకు డిపాజిట్లు కూడా కోల్పోతామని మీ వెన్నులో వెనుక పుట్టిందని ఆమె తెలియజేశారు. పేర్ని నాని నీకు ఒకటే చెబుతున్న గుర్తుంచుకో నువ్వేంటి పవన్ కళ్యాణ్ అన్నయ్యని కాళ్లు చేతులు ఇంచుతా అన్నడం నీ మానసిక స్థితి బాగలేదని ప్రజలకు తెలుస్తుంది నువ్వు అధికారంలో ఉండి ప్రజలకు ఏమాత్రం మంచి చేయలేదని నీ సొంత నియోజకవర్గపు ప్రజలే చెప్తున్నారు అంతేకాకుండా మీ పేటీఎం బ్యాచ్కు నేను ఒకటే చెబుతున్న జాగ్రత్త మీరు ఏ ఇతర పార్టీ నాయకులైన విమర్శించండి కానీ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ని విమర్శించే అంత స్థాయి మీది కాదు అని ఆమె తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య తన సొంత డబ్బు పిల్లల పేర్లు మీద ఉన్న డబ్బుతో పార్టీని స్థాపించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పదేళ్ల చరిత్ర కలిగిన పార్టీ జనసేన పార్టీ అని ఆమె కొనియాడారు. మీ అధినేత జగన్ రెడ్డి లాగా బాబాయ్ కి వెన్నుపోటు పొడిచి చెల్లిని తల్లిని రోడ్లపైకి ఈడ్చి తన తండ్రి పేరు అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేసిన గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అని ఆమె ప్రశ్నించారు. కడప ఆడపడుచు గా చీర సారా మీకు కానుక ఇస్తానని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికల సమయం ఎంతో దూరం లేదని త్వరలోనే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారని ఆమె తెలియజేయడం జరిగింది.