సొంత నిధులతో మంచినీటి బోరు వేయించిన గవర సోమశేఖర్

*మంత్రి పాలెం గ్రామంలో సొంత నిధులతో మంచినీటి బోరు వేయించిన జీవీఎంసీ 85వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్- గవర సోమశేఖర్ రావు

విశాఖ, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా జనసేన పార్టీ జీవీఎంసీ 85 వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు సొంత నిధులతో ఆదివారం జీవీఎంసీ 85వ వార్డులో ఉన్న మంత్రిపాలెం గ్రామంలో జువ్వాలమ్మ ఆలయం వద్ద వేయించిన మంచినీటి బోర్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు మరియు జనసేనపార్టీ పీఏసీ సభ్యులు & గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ కోన తాతారావు ల చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములకతీతంగా ఇచ్చిన మాట ప్రకారం మంచి కార్యక్రమం చేసినందుకు గవర సోమశేఖర్ రావు ని మరియు తనకు సహకరించిన మంత్రిపాలెం జనసైనికులను అభినందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిస్వార్థ జనసైనికులు మాత్రమే చేస్తారని, 2024 లో కొణిదెల పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయుటకొరకు జనసైనికులు కష్టపడి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు, మడక వెంకటరమణ, మడక నూకరాజు, సేనాపతి మణికాంత్, మడక బాబ్జి, సేనాపతి గౌతమ్, గొల్లవిల్లి శ్రీనివాస్, కోరుకొండ జగదీష్,‌ ముత్త భాను ప్రకాష్, కింతాడ రాము, మడక కనకరాజు, మడక గిరి, మడక బాబురావు, సర్వసిద్ధి సన్యాసి రాజు, దుబాయ్ నరసింహ రావు, జెర్రిపోతుల గణేష్, సేనాపతి జితేంద్ర, సేనాపతి శ్రీను, వీర మహిళలు పిన్నింటి పార్వతి, షాలిని, రామలక్ష్మి, రమాదేవి, 85వ వార్డ్ జనసేన నాయకులు దాసరి రమేష్, పి వసంత కుమార్, విందుల చిరు రాజు, బలిరెడ్డి అరవింద్, అట్ట అప్పారావు, నాగ భాస్కర్, దాసరి శ్రీనివాస్, ఈ. శిరీష, గొంతున గోపి కృష్ణ, బలిరెడ్డి కుమార్ శ్రీనివాసరావు, బలిరెడ్డి సోమ నాయుడు, సీరంశెట్టి వెంకట్ రావు, హర్ష, లక్కరాజు సన్నీ, నక్క గోవింద్, గవర నరసింగ్ రావు, ముద్దు సతీష్, దాసరి ఆనంద్, పిల్ల శివ, సుందరపు నవీన్, పెడిరెడ్ల గురు ప్రసాద్, కోమటి ఉదయ్ కుమార్, మంత్రిపాలెం జువ్వాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.