ఒంటిమిట్టలో దిగ్విజయంగా 98వ రోజు పవనన్న ప్రజా బాట

రాజంపేట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఆదివారం నాటికి 98 రోజులు పూర్తి చేసుకుంది. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట ఆదివారం ఒంటిమిట్టలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాంద్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, రాజంపేట జనసేన యువ నాయకుడు అధికారి దినేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి వివరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీరామదాసు బాలయానది, పెద్దకోట్ల శాంతి లకు మలిశెట్టి వెంకటరమణ ఆర్థిక సహకారంతో ఒక్కొక్కరికి 50వేల రూపాయల చెక్కులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తున్న వైసిపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలని ఆయన అన్నారు. వచ్చే 2024 సంవత్సర ఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, రంజిత్ కుమార్, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, వెంకటయ్య, భారతాల ప్రశాంత్, రమాశ్రీనివాసులు, వీరాచారి, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.