క్రియాశీలక సభ్యులతో పార్టీ నిర్మాణం ముందుకు కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు జనసేనాని పవన్ కళ్యాణ్ సందేశం

జనసేన పార్టీతో జనసైనికులు అనుబంధాన్ని మరింత ఎందుకు 2020 సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది అధ్యక్షులు వారికి సంతృప్తిని కలిగించింది సుమారు లక్ష మంది సభ్యులుగా ఈ కార్యక్రమంలో భాగం కావడం పార్టీ పట్ల వారికున్న నమ్మకం అనుబంధాన్ని తెలుపుతోంది. అధ్యక్షుల వారి జిల్లాలో పర్యటన చేస్తున్న సందర్భంలో క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా పని చేస్తున్న అనేక మందితో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలను అధ్యక్షులవారు గమనించిన కొన్ని విషయాలు చాలా ఆవేదనకు గురి చేశాయి కొన్ని సందర్భాల్లో మన జనసైనికులు ప్రమాదాలకు గురై అయిపోయింది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న అప్పుడు వారి కుటుంబాలు అనాధలై పోతున్నారని అధ్యక్షుల వారికి చెప్పినప్పుడు అధ్యక్షుల వారి మనసు చాలా భారంగా మారిపోయింది దీనికి ఏదో ఒక శాశ్వత పరిష్కారం అన్వేషించాలని ఆలోచించినప్పుడు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం. సభ్యత్వం తీసుకున్న వారందరూ ప్రమాదం పరిహారం బీమా పరిధిలోకి వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు అధ్యక్షులవారు పార్టీ కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం అధ్యక్షులవారు తన వంతుగా కోటి రూపాయలను కేటాయించారు.ఇది అందరికీ తెలిసిందే అయితే కొంత బాధాకరం అయినప్పటికీ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కార్యక్రమంలో 67 మంది సైనికులు కుటుంబానికి అండగా నిలిచింది జనసేన పార్టీ. ఇప్పటివరకు ఐదు లక్షల చొప్పున 24 కుటుంబాల వారికి పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా చెక్కులు అందజేశారు. త్వరలో మరో నలుగురికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం అందరికీ భరోసా కలిగే విధంగా చర్యలు చేపట్టారు అందరికీ విజ్ఞాపనతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి మరోసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షులవారు విజయవంతం చేయాల్సిందిగా అందరినీ జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు. అహ్యక్షుల వారు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.