జనసేన యూత్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్

రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జనసేన యూత్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ వీక్షించి గెలిచిన టీం కి బహుమతి ప్రధానం చేసిన రాజానగరం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం 34 టీం లు పాల్గొన్నాయి. హోరా హోరీగా జరిగిన పోటీలలో నరేంద్రపురం, తోకాడ టీం లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఉత్కంటభరితం గా జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో నరేంద్రపురం టీం గెలుపొందింది. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన నరేంద్రపురం టీం కి మొదటి బహుమతి ₹20,000/-, మరియు ట్రోఫీ అందజేయడం జరిగింది… అలాగే రన్నర్ అప్ తోకాడ టీం కి ₹10,000/- బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అలాగే ఉత్తమమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఆనందాల గోవింద్, గంగిశెట్టి రాజేంద్ర, భూషంశెట్టి అర్జున్, పేపకాయల నాగేశ్వరావు, కురుమళ్ళ మహేష్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, అడ్డాల శ్రీను, చిట్టిప్రోలు సత్తిబాబు , కమిడి సత్తిబాబు, మోటుపల్లి మణికంఠ, నాగవరపు చల్లారావు, సోడసాని చిన్నయనాయుడు, పెద్దపాటి వెంకన్నబాబు, పితాని వెంకటేష్, ఈవూరి మహేష్, వట్టికూటి రాధా, సోడసాని రాంకుమార్, వట్టికూటి గోవింద్, అయ్యల విష్ణు, కురుమళ్ళ తేజ, గుబ్బల శ్రీను, వడ్లమూరి శ్రీను , యర్రంశెట్టి పోలరావు, చిలకలపూడి చిన్ని, సోడాసాని వాసు, సోడాసాని హరి, కురుమల్ల వంశీ, మరియు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.