వారాహిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం జనసేన

తాడేపల్లిగూడెం, ఈనెల 12వ తారీఖున పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి రెండవ విడత కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో జరుగు బహిరంగ సభకు మహిళలందరూ కూడా హాజరవ్వాలని అలాగే వారాహి యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ జనసేన నాయకులు పసుపులేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ మహిళలకు బొట్టు పెట్టి సాధారణంగా యాత్రకు ఆహ్వానించడం జరిగింది. అలాగే రాజీవ్ గృహకల్ప ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేసే దిశగా బొలిశెట్టి శ్రీనివాస్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరతామని మరి వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ మీడియా ఇంచార్జ్ ముకేశ్ జనసేన 3 వార్డ్ నాయకులు లావరాజు అలాగే జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు జనసేన కుటుంబులు సభ్యులు పాల్గొనడం జరిగింది.