ఎస్.కే.బి.ఎం.ఎం స్కూల్ దుస్థితిపై చలించిన గాదె

  • ఎస్.కే.బి.ఎం.ఎం స్కూల్ సమస్యలను పరిష్కరించాలి: గాదె

గుంటూరు కార్పొరేషన్ లో నడిబొడ్డున ఉన్న ఏటి అగ్రహారం ఎస్.కే.బి.ఎం.ఎం హై స్కూల్ లో 1200 వందల మంది చదువుకుంటున్న బాల బాలికల దుస్థితి చూసి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చలించిపోయారు.. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. స్కూల్ ఆవరణలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణముగా డ్రైనేజీ వ్యవస్థ స్కూల్ ఆవరణలోకి ప్రవేశించి వ్యర్ధాలు, చెడు నీరు వచ్చి చేరుతున్నాయి. ఈ దుస్థితి వలన దోమలు, క్రిమికిటకాలు పెరిగిపోయి వాటి వలన విద్యార్థిని, విద్యార్థులకు అంటురోగములు మరియు జ్వరములు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం జరుగుతుంది. కావున మున్సిపల్ సిబ్బంది మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్ మీరు తక్షణమే ఈ సమస్యని పరిష్కరించకపోతే జనసేన పార్టీ వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. స్కూల్ ఆవరణలో అధికారులు మరియు స్కూల్ హెడ్మాస్టర్ లేని కారణంగా ఇన్చార్జి తో మాట్లాడి వారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి అని తెలిపారు. స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి వారు తెచ్చిన ఆహారం 450 మందికి విద్యార్థినీ, విద్యార్థులకు అందజేస్తున్నామని వారు తెలిపినారు మేము గమనించిన ఆహారం 50 మందికి మాత్రమే సరిపోతుంది.. ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి అధికారపక్షం పసుపు కలిపినటువంటి ఆహారాన్ని మన పిల్లలకు మనము పెడతామా అని ప్రశ్నించడం జరిగింది..? ఇటువంటి దుస్థితి నుంచి ప్రజలను ఆ దేవుడే కాపాడాలని చేతులు జోడించి ప్రార్థించారు. నిర్మాణములో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగును పరిశీలించి, వారికి ఇంతవరకు బిల్లులు రాలేదని, అందువలన పని సరిగ్గా జరగలేదని మా దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో డి. ఈతో సంప్రదించటం జరిగినది. వారు వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది.. అధికారులు ఈ స్కూలు యొక్క దుస్థితిని చూసి తక్షణమే మరమ్మత్తులు చేస్తారా లేక జనసేన పార్టీ తరపున శ్రమదానం చేయాలో మీ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది మా నిర్ణయం దయచేసి భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన బాలబాలికల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారికి సరి అయిన సదుపాయాలు కల్పించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్,శి ఖా బాలు, చట్రాల త్రినాథ్, కార్పొరేటర్ యర్రంశెటీ పద్మావతి, వార్డు ప్రెసిడెంట్స్ మధు లాల్, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరి రాజేష్, మిర్చి సాయి, సాయి, వీర హిళలు, జనసైనికులు పాల్గొన్నారు.