నాగబాబు రాకతో ఆఘమేఘాలపై పనులు ప్రారంభించిన వైకాపా ప్రభుత్వం

అనంతపురం: జనసేన పార్టీ పీఏసి సభ్యులు నాగబాబు అనంతపురం పర్యటనలో భాగంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రజలు గుంతల రోడ్డులో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు గురైన విషయం విదితమే. అందులో భాగంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి కనువిప్పు కలిగించడానికి ఏర్పాటు చేసిన శ్రమదానం కార్యక్రమం ఆదివారం ఉదయం నాగ బాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలుసుకున్న ప్రభుత్వం, వైకాపా నాయకులు ఆగమేఘాల మీద శనివారం రోడ్డు పనులను చేపట్టారు. గత మూడు సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించని ప్రభుత్వం కేవలం జనసేన పార్టీ ఎక్కడైతే కార్యక్రమాలు చేపడుతుందో అక్కడకి ఆగమేఘాలపై వెళ్లి పనిచేయడం విడ్డూరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిస్కారాల వైపు అడుగులు వేయాలని లేని పక్షంలో రాష్ట్రఒలో ఉన్న గుంతలను, ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకురావడానికి మా జన సైనికులు సిద్దంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని సంజీవ రాయుడు పేర్కొన్నారు.