కోటలుగరువు గ్రామంలో జనసేనలో చేరికలు

  • కోటలుగరువు గ్రామాన్ని సందర్శించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: జిల్లా ప్రధాన కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో గల జి.మాడుగుల మండలం, వంతల గ్రామ పంచాయితీలోని కోటలుగరువు గ్రామాన్ని శనివారం జనసేన నాయకులు సందర్శించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్నప్పటికీ ఆ గ్రామాన్ని చేరుకోవడానికి ముందుగా పాడేరు మండలం, వణుగుపల్లి పంచాయితీ జిడిపగడ గ్రామం వరకూ రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి అరకు పార్లమెంట్ జనసేన ఇన్చార్జ్ డా. గంగులయ్య, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ తదితర నాయకులు బైక్స్ తో అతి కష్టం మీద సన్నని కాలి బాట మీదనే ప్రయాణం చేసి ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎదురు చూస్తున్న గ్రామస్తులు జనసేన నాయకులకు స్వాగతం పలికి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ గ్రామం బాహ్యప్రపంచానికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. కారణం రహదారి సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. ఈ సందర్బంగా గ్రామస్తులనుద్దేశించి లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ వారి స్థానిక కువి భాషలో మాట్లాడుతూ గ్రామ పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన, కనీసం కాలినడకన చేరుకోవడానికి కూడా లేని రహదారి సౌకర్యం ప్రభుత్వాలు కల్పించకపోవడం బాధాకరమని, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుకి మన అభివృద్ధి పనులపై శిత్తశుద్ధి లేదని అన్నారు. జనసేన ద్వారా నియోజకవర్గం పరిధిలో గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పలు సమస్యలపై ప్రజలకు తెలియజేస్తూ మార్పుకోసం పాటు పడే రాజకీయాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డా. గంగులయ్య మాట్లాడుతూ.. ఇప్పటికి ఈ గ్రామ పరిస్థితులు చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, మన ఓట్లు కావాలి కానీ మన క్షేమం ఈ ప్రభుత్వాలకు పట్టదని, పురిటి నొప్పులు వస్తే ఆదివాసీ మహిళలకి జిల్లా కేంద్రంలో గల ఆస్పత్రికి తరలించడానికి కనీసం రహదారి లేకపోవడం చూస్తుంటే పరిస్థితులు ఎంతబయనకంగా ఉంటుందో అర్థమవుతుందోనని అన్నారు. ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయని ప్రతిగ్రామంలో యువత తమ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాల్సిందేనని లేకుంటే కేవలం ఓట్లకు పరిమితమయ్యే సమూహాలుగానే మిగిలిపోతామని అన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడం, సరైన అంగన్ వాడి భవనం లేకపోవడం అన్నిటికీ ప్రధాన కారణం రహదారి సౌకర్యం లేకపోవడమని అన్నారు. మేము జనసేన పార్టీ ద్వారా మీకు తోడుగా ఉంటామని, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ దఫా ఒక అవకాశం ఇద్దామని గ్రామస్తులతో అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు గ్రామస్తులకు తెలియజేసి వారికి వాస్తవ రాజకీయపరిస్తితులపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా గ్రామం మొత్తం కిల్లో రాజన్ ఆధ్వర్యంలో డా. గంగులయ్య గారి చేతుల మీదుగా గ్రామస్తులు జనసేన కండువాలు కప్పుకుని పార్టీ లోకి మూకుమ్మడిగా చేరారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఐటి ఇన్చార్జ్ అశోక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.