పవనన్న సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి: మలిశెట్టి వెంకటరమణ

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాలలో సాధ్యమని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిసిటీ వెంకటరమణ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 105వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం వీరబల్లి మండలం పరిధిలోని సానిపాయ గ్రామపంచాయతీలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాల కరపత్రాలను పంచుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజాపాట సాగుతుంది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాల నుండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో చివరికి రాజధాని లేకుండా చేశారన్నారు. వైసిపి నాయకులు దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం మాత్రం పట్టించుకోలేదన్నారు. కుల పిచ్చితోను మద్ద పిచ్చితోను రాజకీయాలు చేస్తూ, పాండవులకు జాతర్లకు లక్ష రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నారన్నారు. జనసేన పార్టీ ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు నేడు ఆంధ్రప్రదేశ్ వైపు ఏ ఒక్క కంపెనీ గాని కంపెనీ సీఈవోలు గాని చూడలేదన్నారు. వారందరి మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక గుండా దౌర్జన్య కారుడన్నారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారన్నారు. నిరుద్యోగులకు జాబ్ కాలండర్ రిలీజ్ చేస్తామని చెప్పి వాగ్దానం చేసి చేతులు దులుపుకున్నారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులకు డిపాజిట్లు కూడా దక్కమన్నారు. జనసేన ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదు వేల కవులు రైతులను ఆదుకున్న ఘనత ఒక్క జనసేన పార్టీ అన్నారు. ఎక్కడ సమస్య ఉన్న పవన్ కళ్యాణ్ పోరాడితేనే సమస్య తీరుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగి ఉందన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎంత మంచి పరిపాలన వస్తుందని ప్రజలందరూ, ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ, దృష్టిలో ఉంచుకొని రాబోయే 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, రాజంపేట జనసేననాయకుడు ఎంవిఆర్ వెంకటేశ్వరరావు, గుగ్గిళ్ళ వెంకటేశు, జయరాం, జనసేన సీనియర్ నాయకుడు భాస్కర్ పంతులు, రామా శ్రీనివాసులు, జనసేనయువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, అబ్బిగారి గోపాల్, కిషోర్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.