జనసేన పార్టీలోకి భారీ చేరికలు

  • వైసిపి, టిడిపి ఇతర వర్గాల నుండి 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక
  • మల్లంపూడి గ్రామంలో సీనియర్ రాజకీయ నేత ‘సంగుల తమ్మరావు’ వారి అనుచరులు జనసేన పార్టీలో చేరిక
  • రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై పెరుగుతున్న దరణ
  • ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు చూపు జనసేన వైపే
  • రాజానగరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న జనసేన పార్టీ

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నేత సంగుల తమ్మరావు వారి అనుచర గణం, పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామపెద్దలు టిడిపి, వైసిపి, ఇతర వర్గాలకు చెందిన 100 కుటుంబాలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు, సమాజం కోసం ఆయన పడుతున్న తపన..అలానే ఇటీవల రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల కోసం నిలబడుతున్న తీరు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి, ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు, వారందరికీ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన కండువా వేసి మర్యాద పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం బత్తుల బలరామకృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంతో తనకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటానని, రాబోయే ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అలానే మల్లంపూడి గ్రామంలో సంగుల తమ్మారావు గారు ఇతర పెద్దలు పార్టీలోకి చేరడం శుభపరిణామని ఈయన రాకతో మల్లంపూడి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జనసేన పార్టీ బలపడుతుందని ఆశిస్తున్నానని, ఇకనుండి జనశ్రేణులందరూ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం సమిష్టిగా ఒక కుటుంబంలా పనిచేసి, మరింత ఉధృతంగా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టి, తద్వారా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకు అందరూ తమ వంతు బాధ్యతగా ఇప్పటినుంచే శ్రమించాలని పిలుపునిచ్చారు. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మాపై నమ్మకంతో సంగుల తమ్మరావు గారు జనసేన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఇకనుండి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, జనసేన కుటుంబంలో జాయిన్ అయ్యిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీలో చేరిన వారిలో సీనియర్ నేత సంగుల తమ్మరావు గారితో పాటు కేశ్వరపు గణపతి, తంబాబత్తుల ధర్మరాజు, సంగుల శ్రీను, సంగుల ప్రభాకర్ రావు, చంటి, కరాటం సాయి, సంగుల చంటిబాబు, గుబ్బల గోవింద్, పెంకే గోవింద్, పెంకే అన్నవరం, పప్పు నాగబాబు, వటుకుడు త్రిమూర్తులు, పెంకీ నాగేశ్వరావు, సంగుల సుబ్బన్న, సంగుల శ్రీను, వార్డు మెంబెర్ వేరుకొండ పుల్లయ్య, నీలం ధర్మారావు, పప్పు సత్యనారాయణ, సంగుల లచ్చబాబు, వెంకటేష్, కేత వెంకట రమణ, ఇతరు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపూడి గ్రామ నాయకులు సంగుల రమేష్ బాబు, సంగుల దుర్గాప్రసాద్, రాయి గంగాధర్, కలిదిండి మణికంఠ స్వామి, చుట్టూరి స్వామి, గుబ్బల స్వామి, సంగులు చిన్నయ్య దొర, మేకల ప్రదీప్, సంగులు సతీష్ ఎలుబండి వెంకన్న బాబు, కేత వికాస్ కలిదిండి సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మెడిశెట్టి శివరాం, సర్పంచ్లు కిమిడి శ్రీరాం, గుల్లింకల లోవరాజు, సీనియర్ నాయకురాలు నంద్యాల లక్ష్మి, సీనియర్ నేతలు కొత్తపల్లి రఘు, యర్రంశెట్టి శ్రీనివాస్, అడ్డాల శ్రీను, అక్కిరెడ్డి వేణు, పాలచర్ల రాజారావు, అరిగెల రామకృష్ణ, గంగిశెట్టి రాజేంద్ర, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, నాతిపాం దొరబాబు, నడిపిల్లి రామకృష్ణ, చిట్టిప్రోలు సత్తిబాబు, ప్రగడ నాగు బాబు, తోరాటి శ్రీను, సంగిశెట్టి శ్రీనివాస్, రామిశెట్టి సతీష్, ఆనందాల సూరిబాబు, డిఎంఎస్, యర్రంశెట్టి పోలారావు, దేవన దుర్గాప్రసాద్, అర్జున్ రావు ఇతర నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.