బి.టి రోడ్ నిర్మాణ పనుల నాణ్యతను పర్యవేక్షించిన దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం:64వ వార్డ్ కార్పొరేటర్ జనసేన పార్టీ జీవిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి
జీవీఎంసీ వారి నిధులతో వెంకన్న పాలెం గ్రామంలో జరుగుతున్న బి.టి రోడ్ నిర్మాణ పనులను దగ్గరుండి నాణ్యతను పరీక్షించి వేయించడం జరుగుతుంది. ఈ విషయంగా అక్కడున్న గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులి పెంటయ్య రెడ్డి, ధర్మాల అశోక్ రెడ్డి, చుక్క సతీష్ రెడ్డి జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.