నాగారం చెక్ డ్యాంని పరిశీలించిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ మండలంలోని వరదలకు కొట్టుకుపోయిన నాగారం చెక్ డ్యాంని జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తీక్, పాల్వంచ మండల ప్రెసిడెంట్, ఓలపల్లి రాంబాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. నాసిరకం డ్యాంలు కట్టడంతో దళారులు, కాంట్రాక్టర్స్ బాగుపడ్డారు తప్ప ఒరిగింది ఏమి లేదు. 13 కోట్ల వ్యయంతో కట్టి సంవత్సరం అవుతుంది. అయినా కానీ డ్యాం కూలడం దారుణం, తక్షణం ప్రభుత్వం ఒక కమిటీ వేసి నివేదిక తెప్పించాలి, అలాగె నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జి వేముల కార్తీక్, పాల్వంచ మండల ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్. సంపత్ రామ్ వర్మ, ముఖ్య నాయకులు దేవా గౌడ్, ఎం.యు చారి, తరుణ్, వీరేందర్, కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.