భారతీయ రక్తదాత సేవా పురస్కారం అందుకొన్న సౌబిండి వెంకటలక్ష్మి

గుంటూరు: మనిషి చనిపోయాక మన పిడికిలితో మట్టిపోయడం గొప్ప విషయం కాదు! రక్తం అందక చావుబ్రతుకుల్లో ఉన్నవారికి మన పిడికిలి బిగించి రక్తదానం చేసి బ్రతికించేలా చేయడం గొప్ప విషయం, రక్తం అందక ఏ ఒక్కరూ మరణించకూడదు అనే గొప్ప సంకల్పంతో సౌబిండి వెంకటలక్ష్మి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఆమె చేస్తున్న రక్తదాన సేవలు అభి వర్ణించడానికి పదాలు సరిపోవు, మానవ మనుగడ ఉన్నంత వరకు ఆమె కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి, వెంకటలక్ష్మి గారు చేస్తున్న సేవలు గుర్తించి పొన్నూరు బ్లడ్ ఆర్గనైజేషన్ వారు ఆదివారం గుంటూరులో భారతీయ రక్తదాత సేవా పురస్కారం అవార్డుతో అతిరథమహారధుల సమక్షంలో ఘనంగా సత్కరించారు, వెంకటలక్ష్మి గారు ఇలాంటి అవార్డులు ఎన్నో మరెన్నో అందుకొని ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా అభిలాష అని ఆర్గనైజేషన్ వారు పేర్కొన్నారు.