చినుకు పడితే మెయిన్ రోడ్డు చేరువే!

  • మెయిన్ రోడ్ లో అధ్వానంగా వర్షపు నీరు ప్రవహించని మురుగు కాలువలు పరిస్థితి
  • పుర పరిపాలన గాలికొదిలేసిన ఉన్నతాధికారులు
  • జిల్లా కేంద్రంలో ప్రజలకు అష్ట కష్టాలు
  • జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలన్న జనసేన నాయకులు

పార్వతీపురం: చినుకు పడితే పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు చెరువు అవుతోందని జనసేన పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం జనసేన జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, తామరకండి తేజ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలో ఏమాత్రం వర్షం కురిసినా పట్టణ మెయిన్ రోడ్డు వెంకటేశ్వర్ కళామందిర్ మొదలుకొని సారికి వీధి జంక్షన్ వరకు అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ చెరువుగా మారుతుందని అన్నారు. మెయిన్ రోడ్ లో కాలువలు వర్షపు నీరు ప్రవహించని దుస్థితి లో ఉన్నాయన్నారు. సాధారణంగా వేసవికాలంలోనే వర్షాలు రాకముందే మెయిన్ రోడ్డులో మురికి కాలువల పూడిక తీత పనులు చేపట్టి వర్షపు నీటి ప్రవాహానికి అనువుగా మార్చాల్సి ఉందన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు అటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. అలాగే ఇరువైపులా మురుగు కాలువలపై పక్కా నిర్మాణాలు ఉండడంతో మురుగు కాలువల్లో చెత్తతో నిండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తంగా పాలకులు, అధికారుల్లో చెత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.