పెద్దటేకూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ

ఉమ్మడి కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండల పరిధిలోని పెద్దటేకూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ గ్రామ నాయకులు నాగరాజ్, శివ, మంజునాథ్, పెద్దయ్య, కార్తీక్, మౌలాలి, చిరంజీవి, దిలీప్, సాయి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ బాబు చింతా విచ్చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు వై.బజారి, మంజునాథ్, బి.సుధాకర్, సతీష్, కొండల్, కస్తూరి భాస్కర్, రాంబాబు, షబ్బీర్, హుస్సేన్ పవర్, అబ్దుల్లా, మహబూబ్ బాషా, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, నాగేష్, వెంకటేష్, ఖాసిం బాషా, బాలు, రఘు, దాసు, వినోద్, సునీల్, సలాం, విజయ్ మరియు కార్యకర్తలు వీర మహిళలు జనసేన జనశ్రేణులు పాల్గొన్నారు.