ఏలూరు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు..

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నియోజకవర్గంలోని పోణంగి గ్రామంలో ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇల్లాస్థలాలు పరిశీలించడం జరిగింది.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శనివారం ఏలూరు నియోజకవర్గం పోణంగి గ్రామంలో పేదలకు జగన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఇల్లాస్థలాలు కేటాయించిన చోట కనీస మౌలిక సదుపాయాలు ఐనటువంటి రోడ్లు, డ్రైనేజి, వాటర్, కరెంటు వంటివి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అలాగే సరైన రహదారులు లేకపోవడం వలన లబ్ది దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం ఇసుక, సిమెంట్, కంకర ఐరన్ వంటివి రవాణా కు తీవ్ర ఇబందులు పడుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు..

ఏలూరు నియోజకవర్గం లోని పోణంగి గ్రామంలో జగన్ రెడ్డి ఇచ్చిన కాలనీలో ఇంటి నిర్మాణంలో పేదలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగడం లేదు.. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బట్టబయలు చేయడానికే 12,13,14 వ తేదీలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వ అవినీతిని నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపే విధంగా జగనన్న కాలనీలో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.. పేదలందరికీ ఇళ్ళ పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.. అందులో భాగంగా తొలి విడత లో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు..ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది.. రాష్ట్రం లో ఎక్కడా కూడా ఒక ఇళ్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు.. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నవే.. సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.. లబ్ధిదారులు అప్పులు తెచ్చుకుని బెస్మెంట్లు వేసుకున్నారని,కానీ ఇక్కడకు కనీసం ఇసుక కంకర ఐరన్ తెచ్చుకుని ఇల్లు నిర్ముంచుకొనే అవకాశం లేకపోవడం వలన, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, ఇల్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబందులు పడుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులు కు ప్రభుత్వం అందిచవలసిన సిమెంట్, కంకర, ఐరన్, ఇసుకు, వారికి రావలసిన లోను వెంటనే విడుదలచేసి, వారు ఇల్లు నిర్మిచుకోవడానికి అవసరమైన మౌలికసదుపాయాలు వెంటనే ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు..

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, పోణంగి బాబు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని,జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, మాజీ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, వల్లూరి రమేష్, వేముల బాలు, వాసా సాయి, కొనికి మహేష్, పవన్, వెంకట రమణ వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమాదుర్గ, కె.సుజాత, సరళ, జె.సుజాత తదితరులు పాల్గొన్నారు.