చింతలగూడెం రోడ్డుదుస్థితిపై జనసేన ఆధ్వర్యంలో ధర్నా

రంపచోడవరం: ఎటపాక మండలం, సీతంపేట చింతలగూడెం మధ్య రోడ్డు మొత్తం అధ్వానంగా మారింది. వర్షాలతో రోడ్లు పరిస్థితి మరీ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు లారీలు అక్కడ రోడ్డుపై దిగబడి పోతున్నాయి. ఈ సమస్య పై స్పందించిన జనసేన పార్టీ తరఫున ఎటపాక మండల జనసేన అధ్యక్షుడు మారాసు గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. వినుత్నంగా జనసైనికులు రోడ్డుపై నాటు వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలని అధికారులు స్పందించాలని, స్పందించకపోతే 15 రోజుల్లో చందాలు వసూలు చేసి అయినా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న గుంతలు పుడుస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు జి వెంకట్ కొమ్ము వెంకట్ కుంజా అర్జున్ కె వినయ్ ఎస్ కె సాయి కె వెంకటేష్ డి వంశీ, మాలోతు శ్రీను కొమ్ము మహేష్, సూరిశెట్టి సురేష్, బి వేణు, ఎల్ జగదీష్, ఎం భార్గవ్, బి సాయిచంద్, ఐ శ్రీహరి వి వీరయ్య, వి విక్కీ, బి సాకేత్, బి శేఖర్, ఈ జానకి, టి శ్రీను, అర్ర్ సత్తిబాబు, బి. వంశి, సురేష్, సాయి కిరణ్, అఖిల్, అభి మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు నాయకులు పాల్గొన్నారు.