రాజాంలో ఘనంగా జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు

  • యు.పి.రాజు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదినోత్సవాలలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు

రాజాం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్బంగా రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా గురువారం రేగిడి ఆమదాలవలస మండలం నాయకులు రెడ్డి బాలకృష్ణ సమక్షంలో దేవుదళ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ సృష్టికి మూలమైన మహిళల సంరక్షణ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమని ప్రతి ఒక విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, కన్న తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి బాలకృష్ణ, గొర్లె గోవిందరావు, లక్ష్మణ్, నాగరాజు, శ్రీను, ఈశ్వర్ దేవుదళ గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.