నా పార్టీ – నా బాధ్యత

పార్వతీపురం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే నా పార్టీ – నా బాధ్యత. పార్వతీపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు మండల శరత్, టీ తారక్, టీ సంతు, బి చిన్నం నాయుడు, ఆర్ శ్రీను, యూ కరుణ, టీ వంశీ, టీ గోపి, జీ మౌళి, కే సింహాచలం, ఎం హేమంత్, ఎస్ సాయి, ఆర్ రాజు, నవీన్ తదితరులు మాట్లాడుతూ ఒక్కరోజు సాలరీ లేదా కేవలం 100/- రూపాయలు అయినా ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని 28.08.2023 నుండి 2.09.2023 తేదీలలో జనసేనపార్టీ యూ.పి.ఐ ఐడి 7288040505@upi కి నగదు పంపించాలి అని పిలుపునిచ్చారు.