కపిల్ చిల్డ్రన్ వసతి గృహంలో జనసేనాని పుట్టినరోజు వేడుకలు

జగిత్యాల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ నాయకులు కాస రాజు ఆధ్వర్యంలో కపిల్ చిల్డ్రన్ వసతి గృహంలో విద్యార్థులకు బుక్స్ మరియు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాస రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. రానున్న రోజులలో ఆంధ్రపరదేశ్ ముఖ్య మంత్రి కావాలని ఆశిస్తునాం అని అన్నారు. జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యకమాలు నిర్వహిస్తూ ఈ సందర్భంగా ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ తరుపున ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతునం అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జనసేన పార్టీ ఇంచార్జి బెక్కం జనార్దన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పడాల ప్రసాద్ గౌడ్, అజయ్, బబ్లు గౌడ్ శ్రీనివాస్, హరీష్, కుమార్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.