జనసేనాని నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది

అనంతపురం: జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి బాటలు వేస్తుందని జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శులు బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మలు పేర్కొన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం స్వలాభం చూసుకోకుండా రాష్ట్రం కోసం ఈ పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన జనసేన నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని తెలిపారు. వైసిపి నాయకులు అవాకులు చెవాకుల పేలడం మానుకోవాలని వారి అధికారం ఇక ఆరు నెలలే అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బెందేల సాయి, శంకర్ పాల్గొన్నారు.