పాలకొండలో టిడిపి రిలే దీక్షకు జనసేన మద్దతు

పాలకొండ నియోజకవర్గం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పాలకొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు పాలకొండ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు జనసేన నాయకులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి పూల మాల వేసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారని, అతని నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేనపార్టీ తరుపున మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారని, ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని అన్నారు. అధికారంలో ఉండి వైసీపీ చేసిన అవినీతిని బయటికి తీసి జైలుకు పంపే రోజులు దగ్గర లోనే ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మిడితాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.