గన్ పార్క్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరించుకుని నివాళి అర్పించిన రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, పర్యవేక్షణ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఇంచార్జిలు శ్రీమతి కావ్య, శ్రీమతి పి. శిరీష, వంగ లక్ష్మణ్ గౌడ, రవీందర్ రెడ్డి, మాధవరెడ్డి, వేముల కార్తీక్, శివ కార్తిక్, రాజేష్ గార్లు మరియు గ్రేటర్ జనసేన శ్రేణులు పాల్గొన్నారు.