రెండున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏమి చేసారో చెప్పాలి: కటికం అంకారావు

రెండున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని, జనసేన జిల్లా కార్యదర్శి కటికం అంకారావు ప్రభుత్వంపై మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైసిపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మాదిరిగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన ఏద్దేవా చేశారు. రాజధానిలేదు, పోలవరంలేదు, హోదాలేదు, పరిశ్రమలులేవ్, ఉద్యోగాలులేవ్, అన్న క్యాంటీన్లులేవ్, 4లక్షల కోట్ల అప్పు, సిపిఎస్ రద్దులేదు, ఇసుక పాలసీ మీద శ్రద్ద లేదు, పెట్రోల్ డీజిల్ రేట్లపై శ్రద్ద లేదు, పోలవరం మీద శ్రద్ద లేదు, మద్యనిషేధంలేదు, దేవాలయాలపైదాడులు, విగ్రహాల విధ్వంసం, కూల్చివేతలు, బూతుల మంత్రులు, కరోనా కట్టడిలేదు, కోవిడ్ వైద్యంలేదు, సినిమా టికెట్ లు, మటన్ మార్ట్ లు, విపక్షాలు మీదకేసులు, స్థానికఎన్నికలలో అక్రమాలు, అరాచకాలు, ఈ రెండున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు ఇవేనని ఆయన తెలియజేశారు. అధికారంలోకి రావటానికి, నవరత్నాల హామీలను, ప్రజలకు వివరించి, అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎలక్షన్ లో వైసిపీకి బుద్దిచెప్పి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే జనసేన పార్టీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.