ముమ్మిడివరం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం జనసేన కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకి జరగబోయే ముమ్మిడివరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి భవిష్యత్ కార్యాచరణ చర్చించడం గురించి మండల అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశాన్ని మంగళవారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఏర్పాటుచేసారు. ఈ సమావేశంలో గురువారం జరగబోయే విస్తృత స్థాయి సమావేశం గురించి అనేక విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.