తామరపల్లి గ్రామంలో ఇంటింటికి జనసేన

  • గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం.. పవన్ అన్నను గెలిపిద్దాం
  • ఇంటింటికి జనసేన రామచంద్రపురం నియోజకవర్గంలో 5వ రోజు పర్యటనలో భాగంగా గంగవరం మండలం తామరపల్లి గ్రామ పర్యటన
  • భారీ స్థాయిలో పోలిశెట్టి చంద్రశేఖర్ కు ఘనస్వాగతం పలికిన గంగవరం మండల జనసేన నాయకులు, జనసైనికులు

రామచంద్రపురం నియోజకవర్గం: జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ ఆధ్వర్యంలో గంగవరం మండలంలో “ఇంటింటికి జనసేన” కార్యక్రమం ద్వారా మంగళవారం తామరపల్లి గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ తామరపల్లి గ్రామం ఎంపీటీసీ తాడాల జానకిరామ్ ను కలిసి ‘ఇంటింటికి జనసేన’ కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వీరమహిళలు అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.