టీడీపీ నాయకుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన జనసేన

బొబ్బిలి నియోజకవర్గం: టీడిపి ఇంచార్జ్ బేబీనాయన పాదయాత్రకు మద్దతుగా వస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నాగార్జునను తెర్లాంలో పోలీసులు చేసిన అక్రమ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ టీడిపికి సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, తెర్లాం మండల అద్యక్షలు మరడాన రవి, జనసేన నాయకులు, జనసైనికులు ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ తెర్లాం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షలు సంచాన గంగాధర్, చీపురుపల్లి మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాస్, నాయకులు లంక రమేష్, అడబాల నాగు, మండలం నాయకులు బలగ ఆదినారాయణ, సాకేటి కిరణ్, రమేష్, సతీష్, గొలుగువలస జనసైనికులు కొరగంజి సాయి, చిన్న, నెమలం జనసైనికులు రామభద్రపురం నాయకులు కనకాల శ్యాం, అల్లు రమేష్, చీమల సతీష్, బొబ్బిలి యువ నాయకులు పళ్లెం రాజా తదితరులు పాల్గొన్నారు.