జనసేన నాయకుల అక్రమ హౌస్ అరెస్ట్

పెనమలూరు: వైఎస్ఆర్సిపి ఇసుక అక్రమ రవాణా గురించి జనసేన పార్టీ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా సోమవారం జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్ల్రమంలో పెనమలూరు మండలం, జనసేన నాయకులు పెనమలూరు మండల అధ్యక్షులు కరింకొండ సురేష్ మరియు రాజు లను రాత్రి సమయంలో పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందిని గురి చేస్తున్నారని, ప్రజా పాలన రాక్షస పాలన అంటూ జనసేన నాయకులు వాపోతున్నారు.