ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం జనసేన జల సమరం!

పలాస: ఆగిపోయిన ఆఫ్ షోర్ జలాశయం నిర్మాణం పనులు ప్రారంభించాలి అని గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి పాదయాత్రలో వాగ్దానం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత నాలుగున్నర ఏళ్ళు గడిచినా నేటికి కూడా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేసి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసారని జనసేన నాయకులు సోమవారం ఆఫ్ షోర్ ఎడమ కాలువ గ్రామాల ప్రజలను చైతన్య పరుస్తూ సాగుతున్న జనసేన పోరు బాట సాగించారు. పోరాటానికి ఆయా గ్రామాల ప్రజల మద్దతు పలుకుతూ మా యొక్క గ్రామా ప్రధాన సమస్య అయినటువంటి ఆఫ్ షోర్ నిర్మాణానికి నడుంబిగించి నందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డా.దుర్గరావు, హరిశ్ కుమార్ శ్రీకాంత్, పుక్కల ఉమా శంకర్, దిలీప్ పాణిగ్రాహి మందస, మండల అధక్షులు కుప్పాయి గోపాల్, వంశి చౌదరి, లావేటి సురేష్ ధర్మా రావు, కిరణ్, బమ్మిడి మహేష్, దినేష్ లు మిగతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.