ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చు

బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. కార్యక్రమానంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా నిబంధనల నేపథ్యంలో క్యాన్సర్ దినోత్సవాన్ని సాదాసీదాగా జరుపుతున్నామన్నారు. ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. దూరలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. హెల్త్ కేర్ వర్కర్లు.. ఫ్ర౦ట్ లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని బాలకృష్ణ వెల్లడించారు.