ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – తగరపు శ్రీనివాస్

తెలంగాణ, హుస్నాబాద్, గత పదమూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం, సైదాపూర్ మండలంలోని స్థానిక బస్టాండు ఆవరణలో మండల ఆశావర్కర్ల సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆశావర్కర్లు తమ 18 డిమాండ్లను పరిష్కరించేంతవరకు ఈ సమ్మెను విరమించమని, తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలను రోడ్డున పడేసిందన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని, తమ డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు జనసేన అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, ప్రధాన కార్యదర్శి మద్ది స్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల శ్రీను, సోషల్ మీడియా సెక్రెటరీ మొలుగూరి అరవింద్, గ్రామ నాయకులు కనగండ్ల శ్రీకాంత్, పొడిశెట్టి శ్రీనివాస్, అనగోని అంజన్న, గాదపాక జయంత్, బత్తుల సాయి, పొడిశెట్టి రవితేజ, రాజు, సలీం, బొల్లా అరుణ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం

తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గ, సైదాపూర్ మండలంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ కార్యకర్తలకు సూచనలిస్తూ, మండలంలోని ప్రతీ గ్రామానికి పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, బూత్ స్థాయి కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, ప్రధాన కార్యదర్శి మద్ది స్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల శ్రీను, సోషల్ మీడియా సెక్రెటరీ మొలుగూరి అరవింద్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.