పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి కొట్టు, చిర్ల జగ్గిరెడ్డికి లేదు

  • కొత్తపేట నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్

కొత్తపేట: పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు, చిర్ల జగ్గిరెడ్డికి లేదని కొత్తపేట నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం బండారు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ దేవాదాయశాఖ మంత్రి నియోజకవర్గానికి వచ్చి నీ శాఖకు నువ్వు ఏం న్యాయం చేస్తున్నాడో చెప్పకుండా చవకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నాడు‌. జనసేన – టిడిపి కలయికతో స్థానిక శాసన సభ్యులు జగ్గిరెడ్డి గారికి గుబులు పుట్టినట్టుంది‌. నియోజకవర్గంలో కాపులందరు కలుస్తున్నారు అని జగ్గిరెడ్డి గారు వైసిపి కాపు మంత్రిని తీసుకొచ్చి విమర్శలు చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకునే కర్మ లేదు. అయన ఒక యాడ్ చేసుకుంటే వందలు కోట్లు వస్తాయి. అధికారంలో మీ ప్రభుత్వమే ఉందిగా ప్యాకేజీ తీసుకున్నట్టు నిరూపించగలిగారా?. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేయగలిగారు తప్ప. దోషిగా నిరూపించలేకపోతున్నారు‌. 30కి పైగా క్రిమినల్ కేసులు పెట్టుకొని, 16నెలలు జైలు ఉన్న ఘనత, ఘనుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కే చెందుతుంది. తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్న వాడికి పాలేరు తనం చేస్తుంది నువ్వు. కాపులు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే స్థాయి నీకు లేదు కొట్టు సత్యనారాయణ. నీకు మంత్రి రావడం కోసం నువ్వేంత ప్యాకేజీ ఇచ్చావ్..? వైజాగ్ లో ఎంత ప్యాకేజీకి బేరం కుదుర్చుకుని మంత్రి పదవి తెచుకున్నావో తెలియచేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చవకబారు విమర్శలు మనుకుంటే మంచిది అని మంత్రి కొట్టు సత్యనారాయణకి తెలియజేస్తున్నాం. నీకు తాడేపల్లిగూడెంలో డిపాజిట్లు కూడా దక్కవు. మా బొలిశెట్టి శ్రీను చేతిలో ఓటమి చూడటం కాయం అని తెలియజేసారు.