శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మిని పరామర్శించిన జనసేన నాయకులు

దెందులూరు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి భర్త కీ.శే. ఘంటసాల రాజేంద్ర వరప్రసాద్ మూర్తిరాజు ఇటీవల స్వర్గస్తులవడం జరిగింది. ఆదివారం ప్రత్తికోళ్ళలంకలోని వారి స్వగృహం వద్ద నివాళులు అర్పించి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జి పట్సమట్ల ధర్మరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చన్నమళ్ళ చంద్రశేఖర్, మరియు హోటల్ ఎన్ డైరెక్టర్ నారా శేషు మరియు జనసైనికులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.