మురుగు నీటి సమస్యని పరిష్కరించాలని జనసేన వినతి

అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం, నార్పల మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై మురుగునీరు రాకండా తగిన చర్యలు తెస్కుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నార్పల డిప్యూటీ తాసిల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది. సమస్యని వివరిస్తూ కూతలేరు వంతెన పనులలో భాగంగా వేసిన మట్టి కారణంగా డ్రైనేజీలు మొత్తం మూసుకుపోయి వేరే దారి లేక మురుగు నీరు మొత్తం రోడ్ల మీదకి వచ్చి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. నీటిలో నడిచిన వారికి దద్దుర్లు, దురదలతో కూడిన చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు. నిత్యం కూరగాయాల కొసం వెళ్లే ప్రజలు, నవరాత్రులలో భాగంగా ఆమ్మవారిశాలకు, పురాతన ఆలయం చౌడమ్మ, పెద్దమ్మ ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకునే భక్తులు నీటిలో నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యపై త్వరగా స్పందించి మురుగునీరు రోడ్లపై రాకుండా తగు చర్యలు చేపట్టేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జనసేన పార్టీ తరుపున కోరడమైనది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, పొన్నతోట రామయ్య, మహమ్మద్ ఆలీ, వినోదం లోకేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.