అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి అంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ చట్టసభల్లో ప్రజలచేత ఎన్నుకోబడ్డ నాయకులుగా చెలామణీ అవుతున్న ప్రజా ప్రతినిధులు ఈరోజు పోలీసు వ్యవస్థ మీద అజమాయిషె చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సాధరన కానిస్టేబుల్ కావాలన్నా అందుకు తగిన విద్యార్హత, శారీరక మానసిక అర్హతలు నిర్దేశించబడిన ప్రమాణాలులో పదోవంతులేని ప్రజాప్రతినిధులు ఈనాడు ఐ.పి.ఎస్ & ఇంజనీరింగ్ చదివిన అధికారులపై అజమాయిషీ చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒక పోలీసు కుటుంబం నుండి వచ్చాను అని సగర్వంగా ప్రకటించే పవన్ కళ్యాణ్ కి పోలీసుల సాధక బాధకాలపై సంపూర్ణ అవగాహన ఉన్నదనీ, వాళ్ళ కుటుంబాల కష్టాలు తెలిసిన వ్యక్తి అనీ, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో తెలుసు అనీ, అలాంటి పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో రక్షకుడిగా బాధ్యత ఇవ్వాలని కోరారు. ముత్తా శశిధర్ కొన్ని విషయాలు కూడా పంచుకోవాలంటూ ఈ సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థపై ఎంత వత్తిడి ఉన్నదో తెలుస్తోందనీ, అది వాళ్ళు వ్యక్తపరచకపోయినా మీ ఉద్యోగం నిర్వర్తిస్తున్న విధానాన్ని అభినందిస్తున్నా అనీ, దీనికి ఉదాహరణ నేడు కాకినాడ సిటిలో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు స్టేషనులకు తోడు సమాంతరంగా షాడో పోలీసు స్టేషనులు వెలిసాయని ప్రజలు వాపోతున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామ్య పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే ఐదు నెలల్లో ప్రజలు చరమగీతం పాడబోతున్నారనీ, ఎలాంటి ఒత్తిడీ లేని పోలీసు వ్యవస్థ త్వరలో జనసేన ద్వారా మన రాష్ట్రంలో రాబోతొందని పోలీసు కుటుంబాలకు తెలియచేసుకుంటూ అమర వీరులకు జోహారులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, నాయకులు ఆకుల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శివాజీ, పెనుపోటు శివ, వెంకట్, ఆగ్రహరం సతీష్, వాసిరెడ్డి సుబ్బారావు, రమణ,శంకర్, శివాజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.