కనిగిరి జనసేన ఆధ్వర్యంలో షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు

కనిగిరి, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు నేడు పామురు పట్టణంలోని చైల్డ్ హోమ్ నందు పామురు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై. రహిముల్లా ముఖ్య అతిధిగా పాల్గొని పిల్లలకు కేక్, పండ్లు పంచిపెట్టారు తదనంతరం మండల నాయకులు గోష్టు సునీల్ ఆధ్వర్యంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ పురం మండల అధ్యక్షుడు రాజా, నాని నాయుడు, కనిగిరి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.