ఎంపీడీఓకి మదనపల్లె జనసేన వినతి

మదనపల్లె, జనంలోకి జనసేన పట్టణ బాట కార్యక్రమాన్ని బుధవారం మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీ జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాలనీ(నల్లగుట్టవార)లో ప్రజలు గత 30 రోజుల నుండి త్రాగునీరు బోరు చెడిపోయిందని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి స్పందించి గురువారం ఎంపీడీఓ కి జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం మరియు వైఎస్ఆర్ కాలనీ ప్రజలతో కలసి వైయస్ఆర్ కాలనీలో త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు గురించి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఎంపీడీఓ సానుకూలంగా స్పందించడం జరిగిందనీ ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అధికారులు త్వరగా స్పందించి కాలనీ వాసుల నీటి దాహర్తి తీర్చకపోతే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.