రాజ్యసభ మార్చి 8 కి వాయిదా

రాజ్యసభ మార్చి 8వ తేదీకి వాయిదాపడింది. బడ్జెట్‌పై చర్చపూర్తి కావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అనంతరం సభను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దాంతో రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల మొదటి విడుత ముగిసినట్లయ్యింది. రెండో విడుత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి.

కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయ్యాయి. 29న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించిన తర్వాత ఆయన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఆ తీర్మానానికి ప్రధాని మోడి సమాధానం ఇచ్చిన అనంతరం తాజా బడ్జెట్‌పై జనరల్ డిస్కషన్ జరిగింది. ఇవాళ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ ముగియగానే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సభకు సమాధానం ఇచ్చారు.