చట్టాలు రద్దు చేసే వరకు ఇళ్లకు వెళ్లం: తికాయత్

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 75రోజులకు పైగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాతే తాము ఇళ్లకు వెళతామని టికాయత్ స్పష్టంచేశారు. తమ ‘మంచ్.. పంచ్’ ఒకేలా ఉంటాయని.. సింఘు బోర్డర్ తమ కార్యాలయంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు వరకు తమ ఆందోళన నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ మేరకు తికాయత్ శుక్రవారం సింఘూ బోర్డర్‌లో మాట్లాడారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఇళ్లకు వెళ్లడం ఉంటుంది. మా మంచ్.. పంచ్ ఒకేలా ఉంటుంది. సింఘు సరిహద్దు మా కార్యాలయంగా ఉంటుంది. కేంద్రం మాతో ఈ రోజు చర్చలు జరపాలనుకున్నా మేం సిద్ధంగానే ఉన్నాం. మరో పది రోజులకైనా.. లేదంటే మరో ఏడాదికైనా.. మేం చర్చలకు సిద్ధమే. ఢిల్లీ లోపలికి రాకుండా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన మేకులను తొలగించేంత వరకు నగరంలోకి వెళ్లమని రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు.