మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు
సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణకు పండుగ రోజు అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరీశ్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేపటి(బుధవారం) సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ కూడా మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు pic.twitter.com/T17GcRYDm8
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2021
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/02/image-1.png)