గడిచిన 3 సంవత్సరాలలో కనీసం 5% నిర్మాణ పనులు కూడా చెయ్యలేదు

ఉమ్మడి కడపజిల్లా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండల పరిధిలోని పింఛ డాంను జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ ద్వారా డాం లోకి వచ్చిన నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం, పాలక పక్షం వారి చేతకానితనంతో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల పించ డాం దిగువన ఉన్న నదీ పరీవాహక పరిసరాల్లో ఆయా చుట్టుపక్కల ప్రాంతాలలోని రైతాంగానికి సాగునీరు అందక మరియు ప్రజలు త్రాగడానికి గుక్కెడు మంచి నీరు కూడా కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వరద తాకిడికి విపత్తు వల్ల పించ డాం కుడివైపు మట్టి కట్ట తెగిపోయి మూడవ సంవత్సరం జరుగుతున్నా కనీసం 5% నిర్మాణ పనులు కూడా చెయ్యలేదు. ప్రస్తుత వైసీపీ ప్రజాప్రతినిధులు తమ మాటల్లో మాత్రం ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం అని వాగ్దానాలతో అబద్ధాలు చెబుతూ పబ్లిసిటీ కోసమే ప్రజలను నమ్మపలుకుతారు తప్ప ఇక్కడ చూస్తే ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు శున్యం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వీరికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ద్వారా పించ డాం ను అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి రైతులకు సాగునీరు అందించడంతో పాటుగా త్రాగడానికి మంచి నీరు కూడా అందేలా చేస్తామని ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు, చుట్టుపక్కల గ్రామస్థులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొన్నారు.