క్రీడలు మానసికంగా ఉత్సాహాన్ని ఆరోగ్యాన్నిస్తాయి: ఉల్లి సీతారామ్

పాడేరు: చింతపల్లి మండలం, కొత్తపాలెం పంచాయితి డబ్బగరువు గ్రామయువతతో ప్రత్యేకంగా సమావేశమైన జనసేన పార్టీ నాయకులు యువతలో మాట్లాడుతూ.. మార్పుకోరకు గిరిజన ప్రజలకు ఏకైక సరైన రాజకీయ వ్యవస్థ కేవలం జనసేన పార్టీ మాత్రమేనన్నారు. నానాటికి ప్రకృతి విధ్వంసం ఎక్కువైపోతున్న మన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలలో ప్రకృతి సంరక్షణ కూడా ఒక భాగంగా ఉందని విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాడేరు నియోజకవర్గం నుంచి యువనాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే నేటి యువతయే పార్టీకి ప్రదానబలమని వారికోసం వారి ప్రాంతనికున్న పరిమిత వనరులతో సంపద సృష్టి చేస్తామన్నారని తెలియజేస్తూ డబ్బా గడువు గ్రామ యువతకు క్రీడలు మానసిక, ఆరోగ్యాన్నిస్తాయని క్రీడలకు జనసేనపార్టీ ప్రోత్సాహాన్నిస్తుందని అలాగే స్పోర్ట్స్ కోట లో ఉద్యోగావకాశాలు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి అవకాశాలు ఉంటాయి, అదే కాకుండా ఒలింపిక్ అంతటి గొప్ప స్థాయికి చేరుకోవాలని ఔత్సాహిక క్రీడల్లో గిరిజన యువత రానీంచాలన్నారు. ఇందులో భాగంగానే మీకు వాలి బాల్ కిట్లు ఇస్తున్నామని వారికి క్రీడా ఉపకరణాలు, కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉల్లి సీతారామ్, వంతల రాజారావు, కూడా అబ్బాయి దొర, శేఖర్, సాయి రామ్ తదితరులు గ్రామ యువత పాల్గొన్నారు.