ఎర్రబొమ్మలు పంచాయితీలో జనసేన నాయకుల పర్యటన

అల్లూరిసీతా రామరాజు జిల్లా, చింతపల్లి జనసేన పార్టీ నాయకులు గ్రామ పర్యటనలో భాగంగా ఎర్రబొమ్మలు పంచాయితీలో గల సీతారామపురం, బోయిలు గూడెం, కుదుపుసింగి గ్రామాలలో పర్యటన చేశారు. పంచాయితీ పరిధిలో జరిగే గ్రామాభివృద్ధిలో గ్రామాల ప్రస్తుత పరిస్థితులపై, మౌళిఖ సదుపాయాల కల్పనపై వారికి అవగాహన కల్పిస్తూ జనసేనపార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు వివరిస్తూ జనసేన పార్టీకి గిరిజన సాధికారతపై ఒక స్పష్టమైన విధానం వున్నదని ఈ విషయం స్థానిక గిరిజన ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే జనసేన పార్టీ నాయకులు కిల్లో రాజన్ మాట్లాడుతూ ఇప్పటివరకు దశాబ్ద కాలం పాటు కేవలం అధికారమే పరమావధిగా ఆలోచన చేసే పార్టీలను చూసామని ఇప్పటికైనా మార్పు దిశగా ఆలోచన చేయాలని భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ ఇచ్చే విదంగా ఆలోచన చేయాలన్నారు. ప్రస్తుతం అందుకుంటున్న ఉచిత పథకాలు నిజానికి ఉచితాలు కావని కానీ అమాయక గిరిజన ప్రజలు ప్రభుత్వం నిజంగానే ఉచితంగా ఇస్తుందని నమ్మడం కచ్చితంగా అమాయకత్వమే అవుతుందన్నారు. చింతపల్లి నాయకులు ఉల్లిసీతారామ్ మాట్లాడుతూ ఇన్నాళ్లు పలు ప్రభుత్వ పథకాలు ఉచితంగా తీసుకుంటున్న మన గిరిజన ప్రజలకు ఒక స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నాం మీ బిడ్డల భవిష్యత్ తాకట్టు పెట్టి మీకు ఉచిత పథకాలు ఇస్తున్నారు, దేవదాయశాఖ భూములు తాకట్టు పెట్టి ఇస్తున్న ఉచితా పథకాలు, మన అందరిపై, ఆంధ్రప్రదేశ్ ప్రజాలందరిపై ప్రపంచ బ్యాంకు లో రుణం తీసుకుని వారు అధికారం అనుభవిస్తూ అవినీతి చేస్తూ చివరికి ఆ భారం సామాన్యులపై నెట్టేస్తున్నారు. దోచుకోవడమే ఎజెండాగా వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే ఈ విషయంపై గిరిజన ప్రజలు గుర్తించాలన్నారు అందుకు ఉదాహరణ గా చాలా విషయాలు మనమే గమనించవచ్చు నివేదికలు చూడవచ్చు ఒక గ్రామస్థాయి, పంచాయితీ స్థాయి అభివృద్ధి జరిగిందా?లేదు ఎందుకంటే ఆ అభివృద్ధి నిధులు ప్రభుత్వం పక్కదారి మళ్లించి వారి అధికార దర్పనికి మన ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెచ్చించారు, అలాగే గిరిజన, పివిటిజి ప్రజలకు ఇచ్చే సీసీడీపీ నిధుల విషయం సైతం ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాట వేస్తుంది. అలాగే విపత్తులు సంభవించినప్పుడు రైతుల పంట నష్టానికి పరిహారం ఇచ్చే దిశగా ఆలోచన చెయ్యని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ మహమ్మరిని గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనపార్టీ కి ఒక అవకాశం ఇచ్చి మన హక్కులు, చట్టాలు మనమే రక్షించుకోవలన్నారు. ఈ పర్యటనలో కూడా అబ్బాయి దొర, వణభరంగి సాయి రామ్ పాల్గొన్నారు.