ఆవిర్భావ సభకు విచ్చేసిన జనసేన శ్రేణులకు మోపిదేవి మండల జనసేన అధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం సభకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూల్, చిత్తూరు, కడప జిల్లాలు నుండి వచ్చిన లక్షలాది జనసేన శ్రేణులకు మోపిదేవి మండలం జనసేన పార్టీ అధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ ప్రారంభించగా, మోపిదేవి మండల పెదప్రోలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మండల స్థాయి కార్యకర్తలు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.