గిద్దలూరు జనసేన పార్టీ లోనికి వలసలు

గిద్దలూరు నియోజకవర్గం: జనసేన పార్టీ కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ ఆద్వర్యంలో జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు నాయకత్వములో తురిమెళ్ళ గ్రామం నుండి 10 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగినది. గ్రామ నాయకులను ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఇంఛార్జి మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు తురిమెళ్ల గ్రామంలో పార్టీ కోసం పని చేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయమని దిశ నిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడికి నేను అండగా వుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, కంభం మండల అధ్యక్షుడు తాడిసెట్టి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్, లీగల్ సెల్ నాయకులు ఉదయగిరి మల్లికార్జున, సందు నారాయణ, బెస్తవారపేట మండల అధ్యక్షుడు ముంతల మధున సుదనరెడ్డి, సంయుక్త కార్యదర్శి దుమ్మని చెన్నయ్య, తురిమెల్ల గ్రామం నాయకులు బెల్లంకొండ సాయన్న, చేళ్ళ నాగార్జున, మళ్ళారపు నాగేంద్ర, వులాపు రంగనాయకులు, కోళ్ల రాము, నగేష్, ఉదయగిరి సుధీర్, ఉదయగిరి నవీన్, చంగల్ రాందాస్, చంగాల్ ఏడుకొండలు, యర్రంశెట్టి సుబ్బయ్య, గంధం నారాయణ, అక్కపల్లి రాము, యక్కలురి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.