కోనసీమ జిల్లా జనసేన కార్యవర్గ సమావేశం!

*రావాలి పవన్! ఎగరాలి జనసేన జెండా అంటూ!.. రాజోలు నియోజవర్గం, *చింతలమోరులో భారీ స్థాయిలో జిల్లా కార్యవర్గ సమావేశం!
*బండారు శ్రీనివాస్ కు ఘనమైన సత్కారం!
*ఉప్పొంగిన అభిమానంతో కొత్తపేట నియోజకవర్గo జన సైనికులు, కార్యకర్తలు!

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ రథసారధిగా.. ప్రముఖ జనసేన నేతగా.. జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఈరోజు రాజోలు నియోజకవర్గ చింతలమోరు గ్రామంలో క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమము మరియు జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమానికి అతిరథ మహారదులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాలుమూలల నుంచి పలువురు జనసేన పార్టీ ప్రముఖులు, నాయకులు అందరూ హాజరై ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ కు ఘనంగా.. ఎంతో ఆత్మీయతతో అరుదైన సత్కారం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. జన సైనికులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ, రేపటి భవిష్యత్తులో జనసేనాని నాయకత్వానికి కొండంత అండగా వెన్నంటే ఉంటూ.. ప్రతి ఒక్కరూ ముందుకు నడిపించాలని కోరారు. అక్టోబర్ నెల విజయదశమి దసరా సందర్భంగా జనసేనాని చేపట్టబోయే జైత్రయాత్రను బస్సు యాత్రకు.. అంతా సంసిద్ధంగా ఉండాలని.. పలు కార్యక్రమాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్లాలని.. కచ్చితంగా జనసేనాని లాంటి నిజాయితీపరుడను తప్పకుండా గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రజల్లో మార్పు ప్రారంభమైందని.. కుళ్లు కుట్ర రాజకీయాలను చేదించగలిగే ఒకే ఒక్కడుగా, అప్పుల ఊబి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగేది జనసేనాని మాత్రమేనని.. ప్రతిచోట జనసేనాని నాయకత్వమును ప్రజలు ఎంతో ఆత్మీయతతో ఆదరిస్తూ ఉన్నారని.. భారీగా జనసేన పార్టీలోకి చేరుతున్నారని, అప్పులో భారంతో చనిపోయిన పలువురు కౌలు రైతులను ఆదుకోవడంలో, వారి కుటుంబాలకు వెలుగు చూపించడంలోనూ, ఎంతో మానవత్వంతో జనసేనాని ఒక గొప్ప ఆశయం, లక్ష్యంతో ముందుకు కదులుతున్నారని, ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అంచులంచెలుగా పూర్తిస్థాయిలో ఎంతో బలోపేతమై ఒక గొప్ప శక్తిగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్చార్జులు బండారు శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, వేగుళ్ళు లీలా కృష్ణ, మాకినేని శేషు కుమారి, పాఠంశెట్టి సూర్యచంద్ర, పలువురు సీనియర్ ప్రముఖ నాయకులు జనసైనికులు, రాజోలు నియోజకవర్గం పరిసర మండల, గ్రామాల జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ స్థాయిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.