అణచివేయబడిన ప్రజలకు అండగా నిలబడిన నాయకుడు వంగవీటి రంగా

నెల్లూరు: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను నెల్లూరు టౌన్ హాల్ నందు గల రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద బలహీన అణగారిన సామాజిక వర్గాలకు వర్గాలపై జరుగుతున్న దాడులను దౌర్జన్యాన్ని ఎదురొడ్డి నిలబడిన బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగా కులమతాలకతీతంగా సామాన్యుడిపై జరుగుతున్న అరాచకాలను కాండనునిలబడిన సామాజిక వాది. కాలానుగుణంగా అనేకమంది నాయకులు ఒక మెరుపు మెరిసి కాలగర్భంలో కలిసిపోతుంటారు.
కానీ కాలానికి ఎదురీది చరిత్రలో నిలిచిపోయిన నాయకులు కొంతమందే ఉంటారు. వాటిని రాష్ట్ర, ప్రాంత, జాతి రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని చరిత్రలో తమకంటూ సంపాదించుకుంటారు. అణిచివేయబడిన ప్రజలకు అండగా ప్రజా సమస్యలకు నేనున్నానంటూ ఎదురు నిలబడిన నాయకుడు వంగవీటి మోహన రంగా. బడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటూ అడ్డం నిలబడి పెత్తందార్ల రాజకీయానికి ఎదురు నిలిచాడు. అధికారం చలయిస్తున్న కొంత మంది పైకి ఎదగనివ్వకుండా కుట్రపన్ని రాజ్యాధికార కాంక్షను చంపేశామనుకుంటున్నా.. నివరు గప్పిన నిప్పులా జాతి గుండెల్లో ఆయన స్పూర్తి రగులుతూ ఉంది. అణ వర్గాల రాజ్యాధికారం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి.. ఎంతో సంఖ్యా బలం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో రంగా గారికి మద్దతుగా నిలబడలేకపోయిన దానికి ఏమి కోల్పోయామో గుర్తు చేసుకుంటూ. ఇప్పుడు మద్దతుగా నిలవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ పసుపర్తికిషోర్, బావిశెట్టి కిషోర్, గాదిరాజు అశోక్, భూపతి రాఘవన్న, సుధామాధవ్, సుభాషిని, శ్రీహరి రాయల్, వినోద్, శరత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.