భూ సర్వేలో జరుగుతున్న అవకతవకలను సరి చేస్తారా లేదంటే సర్వే ఆపేస్తారా..?: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో జగనన్న భూ సర్వేలో వైసిపి నాయకుల చేతివాటంపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న భూ సర్వేలో వైసిపి నాయకులు చేతివాటం కొనసాగుతుంది. అనడానికి నిదర్శనం ఏదైతే మనుబోలు మండలంలో కుడితిపల్లి నందు సర్వేనెంబర్ మూడులో 11 ఎకరాల భూమి శాస్త్రిక భూమి. ఈ భూమికి తూర్పు పొదలకూరు రోడ్డు, దక్షిణం సిజెఏ ప్లాన్స్, పడమర చెరువు, ఉత్తరం చెరువు మరియు స్మశానం కలిగి ఉన్నాయి. అయితే శంకర్ రెడ్డి అనే ఆయన హస్త గతంలో ఈ 11 ఎకరాల భూమిని పెట్టుకొని ఎనిమిది మందికి అగ్రిమెంట్ల రూపంలో అమ్మకం చేయడం జరిగింది. అయితే ఈనెల 14వ తారీకు భూ సర్వేలో భాగంగా ఆ భూమిని కొనుగోలు చేసి మూడు సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నటువంటి కంటే సుధాకర్ కు ముందు రత్నమ్మ వీళ్ళు ఇరువురు కూడా సర్వే దగ్గరికి వెళ్లి నిలబడి ఉంటే ఏదైతే చెందిన గుండుబోయిన ప్రసాద్ వైసీపీ నాయకుడు ఆ భూమి నాది అని చెప్పి వాగ్వాదానికి వివాదానికి దిగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కంటే సుధాకర్ అడిగే వివరణ ఒక్కటే భూ సర్వే చేసేటప్పుడు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది. ఎవరు సాగుబడి చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్న తర్వాతే మీరు పట్టాలు మంజూరు చేయాలి. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీ వైసీపీ నాయకులకి పంచుకుంటాం అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు మేము ఒకటే కోరుతున్నాం. మీ నాయకులు, మీ కార్యకర్తలు ఇంతటి అరాచకాలకు పాల్పడుతూ అర్హులైన భూమి మాది అని వినియోగంలో ఉన్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జరిగితే జనసేన పార్టీ ఊరుకోదు. మీకు కాలం 60 రోజులే గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కళ్ళు తెరిచి భూ సర్వేలో జరుగుతున్న అవకతవకలను సరి చేస్తారా లేదంటే భూ సర్వే ఆపేస్తారా అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణి, భవాని వెంకటాచలం, మండల సమన్వయకర్త శ్రీహరిస్థానికులు కంటే సుధాకర్, సుబ్రహ్మణ్యం, బింకిన సుగుణమ్మ, కంటే శ్రీనివాసులు, దామ వెంకటేశ్వర్లు, కంటే శారద, కంటే కావ్య, బింకేన శ్రీనివాసులు, కంటే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.