జగన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించండి

  • మానసిక రుగ్మతతో బాధపడుతున్న జగన్ రెడ్డిki మెరుగైన వైద్యం అందించండి
  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: వైయస్ విజయమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి… మీ కుమారుడు క్రిమినల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు, దయచేసి మెరుగైన వైద్యం అందించండి అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని భీమవరంలో ప్రారంభిస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రభుత్వ వేదిక పైన పిల్లల ముందర ప్రతిపక్షాలను విమర్శించడమే తప్పు? అలాంటిది జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ పెళ్ళాలు గురించి మాట్లాడుతూ పిల్లలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నావు క్రైమ్ స్టార్ జగన్ మోహన్ రెడ్డి గారు?. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడలేదు? పిల్లల ముందర ఇంత నీచ నికృష్టమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం తెలిస్తే పిల్లలు పాడైపోతారు అంటున్నావ్? నీ కోడి కత్తి డ్రామా వేషాలు తెలిసి రాష్ట్ర పిల్లలేమన్న పాడైపోయారా? మీ చిన్నాన్న కీర్తిశేషులు వివేకానంద రెడ్డిని గొడ్డలితో అతి కిరాతకంగా చంపిన కొంతమంది వ్యక్తులు నీ వెంటే ఉన్నారు. విషయం పిల్లలకు తెలిసి ఏమైనా చెడిపోయినారా? మీరు పాదయాత్రలో వచ్చే ఎన్నికలకు నేను మద్యం షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తాను అని చెప్పారు? ఈ ఎన్నికలకు మీరు మద్యం షాపులు తీసేసి వస్తారా? లేదా?. ఇసక మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఈ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తుంది?. ప్రజల వనరుల ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు అయినా ఈ నాలుగున్నర సంవత్సరంలో పూర్తి చేశారా?. ప్రత్యేక హోదా ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి ఏమైంది? నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటివి ఇచ్చారా?, ఈ నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రానికి ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చాయా? రాష్ట్రానికి ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయి?, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు?. కియా అనుబంధ సంస్థలు పక్క రాష్ట్రాలకు ఎందుకు తరలిపోయాయి?. అమర్ రాజ్ బ్యాటరీ వాళ్లు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు?. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేశారా?, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేశావా? కాంటాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేశావా?. మెగా డీఎస్సీ ఏమైంది? ఆశా వర్కర్ల పరిస్థితి ఏమి?. అంగన్వాడీల పరిస్థితి తేల్చు? మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి ఇబ్బడి ముబ్బడి గా మీరు నోటికొచ్చినట్లు ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పండి? ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు మాత్రం కొన్ని సంక్షేమ పథకాలను భూతద్దంలో చూపిస్తూ? రాష్ట్రంలో మీ క్రిమినల్ గ్యాంగ్ దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతూ దోచుకుంటున్న సంపదంత ఎక్కడికి పోతుందో చెప్పగలరా? అంతేగాని అనవసరంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు వస్తామంటే… ప్రజలు నడి వీధుల్లో తరిమి, తరిమి, తన్ని కొడతారని హెచ్చరించారు.